Weed-Identification Calaris Xtra Telugu – Weed Management
Your address will show here +12 34 56 78
మీ కలుపులను తెలుసుకోండి !


 • అక్రాక్నే రేస్‌మోసా

  అక్రాక్నే రేస్‌మోసా

  విశదీకరణ: అక్రాక్నే రేస్‌మోసా పుట్టుక గడ్డి కుతుంబంలో ఆసియా, ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా మొక్కల జాతిది. జాతిలోని ఈ స్పెసీస్‌ని మామూలుగా గూస్ గడ్డి అంటారు. స్థానిక పేరు - సోనెమావు (కన్నడ), చారే వాలి ఘాస్ (హిందీ), నదిన్ (పంజాబీ)
 • బ్రకియారియా ఎరూసిఫోర్మిస్

  బ్రకియారియా ఎరూసిఫోర్మిస్

  విశదీకరణ: బ్రకియారియా ఎరూసిఫోర్మిస్ అనేది హానికర కలుపు, ఇది ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియా లోని ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో మరియు యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పాదకతను ప్రభావితం చేస్తోంది. ఇది ఏడాది పొడవునా ఉండే గడ్డి, ఆకు అంచులు మరియు ఆకు కోశాలు ఎర్రగా-ఊదా రంగులో ఉండటం వల్ల సులభంగా గుర్తించవచ్చు. స్థానిక పేరు - హాంచీ హారక్ హుల్లు (కన్నడ), దోమకళ్ళు గడ్డి (తెలుగు), పాల పుల్ (తమిళ్), షింపీ (మారాఠీ), కలియు (గుజరాతి), నదిన్ (పంజాబీ), పారా ఘాస్ (బెంగాలి), క్రెబ్ ఘాస్/పారా ఘాస్ (హిందీ)
 • బ్రకియారియా రెప్టన్స్

  బ్రకియారియా రెప్టన్స్

  విశదీకరణ: బ్రకియారియా రెప్టన్స్ అనేది ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, దక్షిణ యూరప్, అమెరికా, ఇండియా మరియు వివిధ దీవుల్లోని ఉష్ణమండల మరియు ఉప-ఉష్ణమండల యొక్క చిన్న వార్షిక మూలిక. ఇది ఏడాది పొడవున లేదా ఏడాదికి ఒకసారి వచ్చే గడ్డి, సాధారణంగా ఎక్కువ కొమ్మలు ఉంటాయి, గణుపుల వద్ద వేర్లలో మరియు పైన నెమ్మదిగా పాకుతుంది. ఈ కలుపు జన్మస్థానం ఆఫ్రికా మరియు అనంతరం మిడిల్ ఈస్ట, భారత మరియు ఆగ్నేయాసియా ఉప ఖండాలను, చైనా ఫిలిప్పైన్స్, ఇండోనేసియా, ఆస్ట్రేలియా మరియు పసిఫిక్ దీవులలో ఉష్ణమండలాలకు వ్యాపించింది. స్థానిక పేరు - పోరె హుల్లు (కన్నడ), కందుక్కల్ పుల్ (తమిళ్), నదిన్ (పంజాబీ), వాఘ్నాఖి (మరాఠీ), కలియు (గుజరాతి), క్రెబ్ ఘాస్/పారా ఘాస్ (హిందీ), పారా ఘాస్ (బెంగాలి), ఎదురు ఆకుల గడ్డి (తెలుగు)
 • బ్రక్రియారియా రమోసా

  బ్రక్రియారియా రమోసా

  విశదీకరణ: బ్రక్రియారియా రమోసా అనేది స్వచ్ఛమైన స్టాండ్స్‌లో సాగుచేయబడుతుంది. అవి మెట్ట పొలం వరిలో పెరుగుతున్నట్లుగా మరియు కొన్ని మిల్లెట్స్‌ని వైవిధ్యమైన వ్యవసాయ యోగ్యమైన భూముల్లో కనుగొనబడ్డాయి. ఇది నేలపై పాకుతుంది, నోడ్స్ గ్లాబ్రస్ లేదా మెత్తని విల్లియస్. స్థానిక పేరు - బెన్నె అక్కుహుల్లు (కన్నడ), అండు కొర్రలు (తెలుగు), నదిన్ (పంజాబీ), నందుక్కల్ పుల్ (తమిళ్), వఘ్నాంఖి (మారాఠీ), కలియు (గుజరాతి), క్రెబ్ ఘాస్/పారా ఘాస్ (హిందీ), చెకూర్ (బెంగాలి)
 • డాక్టిలోక్టేనియమ్ ఏజిప్టియమ్

  డాక్టిలోక్టేనియమ్ ఏజిప్టియమ్

  విశదీకరణ: డాక్టిలోక్టేనియమ్ ఏజిప్టియమ్ అనెది ఆఫ్రికాలోని పొయిసాయి కుటుంబంలో సభ్యురాలు, కానీ ప్రపంచవ్యాప్తంగా సహజీకరించబడింది. చెమ్మ సైట్‌ల్లోని నల్లరేగడి నేలల్లో మొక్క ప్రధానంగా పండుతుంది. ఇది సన్నగా నుంచి ఒకమోస్తరు శక్తివంతంగా ఉంటుంది, వార్షిక మొక్కను వ్యాపింపజేస్తుంది, దీని వైరు కాండాలు వంపు తిరిగి ఉంటాయి మరియు వేరు దగువ గణుపుల వద్ద ఉంటుంది. స్థానిక పేరు - కోనన టేల్ హుల్లు (కన్నడ), నక్షత్ర గడ్డి /గానుక గడ్డి (తెలుగు), కాకక్కల్ పుల్ (తమిళ్), హర్కీన్ (మారాఠీ), మకడా (పంజాబీ), మకడా/సవాయ్ (హిందీ), చోకదియు (గుజరాతి), మకోర్ జైల్ (బెంగాలి)
 • డిజిటారియా సాంగినాలిస్

  డిజిటారియా సాంగినాలిస్

  విశదీకరణ: డిజిటారియా సాంగినాలిస్ అనేది జీనస్ డిజిటారియా యొక్క బాగా తెలిసిన జాతుల్లో ఒకటి మరియు ఇది దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా మామూలు కలుపు. దీనిని జంతువుల పశుగ్రాసంగా ఉపయోగిస్తున్నారు మరియు విత్తనాలను వంటకు ఉపయోగిస్తున్నారు. జర్మనీలో మరియు ప్రత్యేకించి పోలండ్‌లో గింజల్లో ఉపయోగిస్తున్నారు. పోలాండ్‌లో కొన్నిసారులు సాగు చేస్తున్నారు. అందుకే దీనికి పోలిష్ మిల్లెట్ అనే పేరు వచ్చింది. స్థానిక పేరు - హంబేల్ హుల్లు (కన్నడ), అరిసీ పుల్ (తమిళ్), టోకరి (బెంగాలి), వాఘ్నఖీ (మరాఠీ), బుర్ష్ ఘాస్/చిన్యారి (హిందీ), నదిన్ (పంజాబీ), అవరోటారో (గుజరాతి), చిప్పర గడ్డి (తెలుగు)
 • డినెబ్రా అరబికా

  డినెబ్రా అరబికా

  విశదీకరణ: డినెబ్రా అరబికా అనేది సెనెగల్ మరియు నైజీరియాల్లోని మాగాణి మరియు తేమ లేదా పొడి ప్రదేశాల్లో ఒక మీటర్ ఎత్తులో ఉండే కర్రతో లూజు గుచ్ఛాలు గల వార్షిక గడ్డి మరియు ఇది ఉష్ణమండల ఆఫ్రికాకు మరియు తూర్పు దిశన ఈజిప్టు మరియు ఇరాక్ నుంచి ఇండియా వరకు విస్తరిస్తోంది. అన్ని భౌగోళిక ప్రాంతాల్లో సాగు చేసే భూమిలో గడ్డి మామూలు కలుపుగా ఉంది. స్థానిక పేరు - నార బాలద హుల్లు (కన్నడ), కొంక నక్క/గుంట నక్క గడ్డి (తెలుగు), ఇంజి పుల్ (తమిళ్), లోన్యా (మరాఠీ), ఖరయూ (హిందీ), నాదిన్ (పంజాబీ), ఖరయు (గుజరాతి), జల్ గీతే (బెంగాలి)
 • ఇకినోక్లోవా కోలోనా

  ఇకినోక్లోవా కోలోనా

  విశదీకరణ: ఇకినోక్లోవా కోలోనా అనేది వార్షిక గడ్డి. అనేక వేసవి పంటల్లో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన గడ్డి కలుపుగా ఇది గుర్తింపు పొందింది మరియు 60కి పైగా దేశాల్లో కూరగాయగా ఉంది. వెస్టెండీస్‌లో, 1814లో క్యూబాలో మొట్టమొదటగా ప్రచురించబడింది. ఇది ఉష్ణమండల ఆసియా నుంచి ఉత్పన్నమైన ఇది ఒక రకం వైల్డ్ గడ్డి. స్థానిక పేరు - కాదు హరక (కన్నడ), ఉత్తగడ్డి/దొంగ వరి (తెలుగు), సామో (గుజరాతీ), కుదురైవాలి (తమిళ్), పాఖడ్ (మరాఠీ), సామక్/సావన్ (హిందీ), స్వాంకీ (పంజాబీ), పహరీ షామ/గెతె షామ (బెంగాలి)
 • ఇకినోక్లోవా క్రస్ గల్లీ

  ఇకినోక్లోవా క్రస్ గల్లీ

  విశదీకరణ: ఇకినోక్లోవా క్రస్ గల్లీ పుట్టుక ఉష్ణమండల ఆసియా. గతంలో దీనిని ఒక రకమైన పానికమ్ గడ్డిగా వర్గీకరించారు. దీని యొక్క సర్వోత్తమ బయాలజీ మరియు పర్యావరణానికి అలవాటుపడడం వల్ల ఇది ప్రపంచంలోనే అత్యధిక నష్టం కలిగించే కలుపుల్లో ఒకటిగా ఉంది. ఇది భిన్నదేశాల్లో విస్త్రుతంగా వ్యాపించింది, లెక్కలేనన్ని పంట వ్యవస్థల్లో సోకుతోంది. స్థానిక పేరు - సింపగన హుల్లు (కన్నడ), పెద్ద విందు (తెలుగు), గావట్ (మరాఠీ), నెల్‌మరెట్టి (తమిళ్), సామక్ (హిందీ), సామో (గుజరాతీ), స్వాంక్ (పంజాబీ), సావ/స్వాంక్ (హిందీ), దేశి షామ (బెంగాలి)
 • ఎలూసిన్ ఇండికా

  ఎలూసిన్ ఇండికా

  విశదీకరణ: ఎలూసిన్ ఇండికా అనేది భారతీయ గ్రూస్ గడ్డి, యార్డ్-గడ్డి, గ్రూస్ గడ్డి, వైర్‌గడ్డి లేదా క్రోఫుట్ గడ్డి అనేది పొవాసేయి కుటుంబంలోని గడ్డి జాతి. దాదాపు 50 డిగ్రీల లాటిడ్యూడ్‌కి (అక్షాంశరేఖ) ప్రపంచంలోని వేడి ప్రాంతాల అంతటా విస్తరించిన చిన్న వార్షిక గడ్డి ఇది. కొన్ని ప్రాంతాలలో ఇది దాడిచేసే జాతి. స్థానిక పేరు - హక్కి కాలిన హుల్లు (కన్నడ), తిప్ప రాగి (తెలుగు, తమిళ్), రన్నచాని (మారాఠీ), చొఖాలియు (గుజరాతీ), కోడో (హిందీ), బిన్న చాల/చాప్ర గడ్డి (బెంగాలి)
 • ఎరాగ్రీస్టిస్ టెనెల్లా

  ఎరాగ్రీస్టిస్ టెనెల్లా

  విశదీకరణ: ఎరాగ్రోస్టిస్ టెనెల్లా అనేది భిన్న సైజులు గల, సాధారణంగా ఎత్తు 50 సెం.మీకి మించకుండా చిన్న దట్టమైన గుచ్చం గల వార్షిక గడ్డి. సెనెగల్ నుంచి పశ్చిమ కామెరూన్స్ మరియు ఉష్ణమండల ఆఫియా మరియు ఆసియా అంతటా మామూలుగా ఉండే బీడు భూముల గుట్టలు, రోడ్లు పక్క భూములు మరియు సాగునీటి భూమిలో మొలకెత్తే సున్నితమైన గుచ్ఛం గల వార్షిక గడ్డి. స్థానిక పేరు - చిన్న గరిక గడ్డి (తెలుగు), చిమన్ చార (మరాఠీ), కబూథర్ దాన, చిడియా దానా (హిందీ), భూమ్షీ (గుజరాతీ), సాదా ఫుల్కా (బెంగాలి), కభూతర్ దానా (పంజాబీ)
 • లెప్టోక్లోవా కినెన్సిస్

  లెప్టోక్లోవా కినెన్సిస్

  విశదీకరణ: లెఫ్టోక్లోవా కినెన్సిస్ అనేది మామూలు వరి కలుపు. ఇది ఆస్ట్రేలియాలో విలక్షణమైనది కాదు కానీ, న్యూ సౌత్‌వేల్స్, క్వీన్స్‌ల్యాండ్ మరియు ఇండియాలో కానుగొనబడింది. ఈ విలక్షణమైన కలుపు ఉండటానికి కారణం బహుశా ఆగ్నేయాసియా, శ్రీలంక, ఇండియా, చైనా, ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా లాంటి అనేక యూరోపియేన్ యేతర దేశాల్లోని ఉప-ఉష్ణమండల ప్రాంతాల నుంచి విత్తనాల ద్వారా పొరబాటున ప్రవేశపెట్టడమైనది. ఆక్వాటిక్ మరియు సెమీఆక్వాటిక్ వాతావరణాల్లోని బలమైన గుచ్ఛం గల వార్షిక గడ్డి ఇది. స్థానిక పేరు - పూచికపుల్లల గడ్డి (తెలుగు), ఫూల్ జాధు (హిందీ, పంజాబీ), చోర్ కంట (బెంగాలి), సీలైపుల్ (తమిళ్)
 • రాట్‌బొయిల్లియా కొకిన్‌కినెసిస్

  రాట్‌బొయిల్లియా కొకిన్‌కినెసిస్

  విశదీకరణ: రాట్‌బొయిల్లియా కొకిన్‌కినెసిస్ అనేది 1920ల్లో ఫ్లోరిడాలోని మియామీలో ప్రవేశపెట్టబడిన స్థానికంగా కాని, వెచ్చని-సీజన్, వార్షిక గడ్డి, ఇది పిలకలు ఎక్కువగా వచ్చే గడ్డి. ఇది పంటల వరుసల్లో, పచ్చికబయళ్ళలో మరియు రోడ్డు పక్కల్లో ఇది ఎక్కువగా పెరుగుతుంది. అమెరికా, ఆఫ్రికా, ఆసియా మరియు ఓషియానియా లాంటి 30కి పైగా వెచ్చని వాతావరణం గల దేశాల్లో ఈ గడ్డి ఉంది. తేమ చొరబడే భారీ టెక్చర్ గల నేలల్లో ఇది పరిఢవిల్లుతుంది. స్థానిక పేరు - ముల్లు సజ్జె (కన్నడ), కొండ పూనుకు (తెలుగు), సునైపుల్ (తమిళ్), బారు (హిందీ), ఫాగ్ ఘాస్ (బెంగాలి)
 • సెటారియా విరిడిస్

  సెటారియా విరిడిస్

  విశదీకరణ: సెటారియా విరిడిస్ పుట్టుక యూరాసియా, కానీ ప్రవేశపెట్టిన జాతిగా అనేక ఖండాల్లో ఉంది. గట్టిగా ఉండే ఈ గడ్డి పట్టణాల్లో ఖాళీ లాట్‌లు, సైడ్ వాక్‌లు, రైల్ రోడ్లు, లాన్‌లు మరియు పొలాల మార్జిన్‌లు లాంటి అనేక రకాలుగా సాగుచేయబడుతుంది. ఇది కొర్రల పంటలో వైల్డ్ యాంటిసిడెంట్. స్థానిక పేరు - హనాజీ (కన్నట), చిగిరింట గడ్డి (తెలుగు), తినయ్ (తమిళ్), చిక్తా (మరాఠి), ఖుట్ట ఘాస్ (పంజాబీ), కుటరా గ్రాస్ (గుజరాతీ), కాంటే వలీ ఘాస్/చిప్‌కనే వాటా ఖుట్టా (హిందీ), కహోన్ (బెంగాలి)
 • అకాలిఫా ఇండికా

  అకాలిఫా ఇండికా

  విశదీకరణ: ఆకాలిఫా ఇండికా అనేది చిన్న పూత చుట్టూ కప్పు ఆకారంలో ఉండే క్యాటికిన్-లాంటి పూత గల హెర్బాసియస్ వార్షిక గడ్డి. దీని వేరు దేశీయ పిల్లులకు ఆకర్షణీయమైనది మరియు వివిధ ఔషధీయ ఉపయోగాలు ఉన్నాయనే పేరు ఉంది. ఉష్ణమండలాల అంతటా ఇది కలుగుతుంది. స్థానిక పేరు - కుప్పి గిడ (కన్నడ), కుప్పిచెట్టు/మురిపింది ఆకు (తెలుగు), కుప్పయ్‌మెని (తమిళ్), కుప్పి (మారాఠీ), ఫుల్కియా (గుజరాతీ), ఫుల్కియా (హిందీ), ముక్త/హురి/స్వాట్ బసంత (బెంగాలి)
 • అకిరాంతెస్ ఆస్పెరా

  అకిరాంతెస్ ఆస్పెరా

  విశదీకరణ: అకిరాంతెస్ ఆస్పెరా అనేది అమరాంతసేయి కుటుంబంలోని మొక్క జాతి. ఇదిప్రపంచంలోని ఉష్ణమండలం అంతటా పంపిణీ అవుతుంది. దీనిని అనేక ప్రాంతాల్లో ప్రవేశ పెట్టిన జాతిగా మరియు మామూలుజ్ కలుపుగా ఇది పెరుగుతోంది. ఇది అనేక పసిఫిక్ దీవుల వాతావరణంతో సహా కొన్ని ప్రాంతాల్లో ఇన్వేజివ్ జాతిగా ఉంటోంది. స్థానిక పేరు - ఉత్తరాణ (కన్నడ), నాయ్ ఉరువి (తమిళ్), అఘాడ (మరాఠీ), లాత్‌జిరా (హిందీ) అంధెడో (గుజరాతీ), పాంగ్ (బెంగాలి), ఉత్తరాణి (తెలుగు), చిర్చిత (పంజాబీ)
 • ఆంపెలామస్ అల్బిడస్

  ఆంపెలామస్ అల్బిడస్

  విశదీకరణ: ఆంపెలామస్ అల్బిడస్ అనేది ఏడాది పొడవునా ఉండే తీగ మూలిక. దీని పుట్టుక తూర్పు మరియు మధ్యమ యు.ఎస్. రాష్ట్రాలు, ఓంటారియో మరియు ఇండియా. ఇది మోనార్క్ తేనెటీగల యొక్క లార్వా ఆహారం మరియు పాల కలుపు టస్సక్ మోత్ లార్వా. దీనిని తాకితే కళ్ళ మంట కలిగించవచ్చు మరియు తింటే మీ గుండెను ఆపేయవచ్చు. ఇది పశువులకు ప్రత్యేకంగా సమస్యాత్మకమైనది. స్థానిక పేరు - సాంబర గద్దె (కన్నడ), తేలకుచ్ (బెంగాలి)
 • ఆల్టర్నేంథెరా సెస్సిలిస్

  ఆల్టర్నేంథెరా సెస్సిలిస్

  విశదీకరణ: ఆల్టర్నేంథెరా సెస్సిలిస్ అనేది సెసెల్లే జాయి-వీడ్ మరియు డ్వార్ఫ్ కాపర్‌లీఫ్ లాంటి అనేక మామూలు పేర్లతో పిలవబడుతోంది. దీనిని అనేక ఆసియా దేశాలలో మరియు ప్రత్యేకించి శ్రీలంకలో కూరగాయగా ఉపయోగిస్తున్నారు. పాత ప్రపంచంలోని ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల ప్రాంతాలన్నిటిలోనూ ఈ మొక్క పెరుగుతుంది. దీనిని దక్షిణ యునైటెడ్ స్టేట్స్‌లో ప్రవేశపెట్టబడమైనది మరియు మధ్య మరియు దక్షిణ అమెరికాలో దీని పుట్టుక తెలియదు. స్థానిక పేరు - హొన్న గన్నె సొప్పు (కన్నడ), పొన్నగంటి ఆకు (తెలుగు), మూల్ పొన్నన్‌గని (తమిళ్), రెషింకట (మరాఠీ), గుడై సాగ్ (హిందీ), పానీ వాలీ బుట్టీ (పంజాబీ), ఫులుయు (గుజరాతీ), మలోంచ సాక్ (బెంగాలి)
 • ఆల్టర్నేంథెరా ఫైలోక్సెరోయిడెస్

  ఆల్టర్నేంథెరా ఫైలోక్సెరోయిడెస్

  విశదీకరణ: ఆల్టర్నేంథెరా ఫైలోక్సెరోయిడెస్ అనేది అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వే మరియు ఉరుగ్వే లాంటి దక్షిణ అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాలకు చెందిన జాతి. దీని భౌగోళిక శ్రేణి ఒకప్పుడు దక్షిణ అమెరికాలోని పరన నది ప్రాంతంలో మాత్రమే ఉండేది. ఆ తరువాత యునైటెడ్ స్టేట్స్, న్యూజిలాండ్, చైనా మరియు ఇండియాతో సహా మొత్తం 30 దేశాలకు విస్తరించింది స్థానిక పేరు - మీర్జా ముల్లు (కన్నడ), మూల్ పొన్నన్‌గని (తమిళ్), గుడై సాగ్ (హిందీ), పానీ వాలీ బుట్టీ (పంజాబీ), ఖాకి/ఫులుయ్ (గుజరాతీ), మలోంచ సాక్ (బెంగాలి)
 • అమరాంతస్ విరిడిస్

  అమరాంతస్ విరిడిస్

  విశదీకరణ: అమరాంతస్ విరిడిస్ అనేది వార్షిక మూలిక. ఇది తిన్నగా ఉండి మొదలు నుంచి ఆకు పచ్చని కాండం ఉద్భవిస్తుంది. మొక్కకు కొద్ది కొమ్మలు మరియు చిన ఆకుపచ్చని పూతతో టెర్మినల్ కంకులు ఉంటాయి. కొన్ని దేశాల్లో దీనిని కూరగాయగా తింటారు. దీనిలో యాంటీవైరల్ మరియు యాంటీక్యాన్సర్ గుణాలు మరియు యాంటీనోసిసెప్టివ్ కార్యకలాపం ఉంది. స్థానిక పేరు -కేరె సొప్పు (కన్నడ), చిలకతోటకూర (తెలుగు), జంగ్లీ చొళై (హిందీ), కుప్పై కీరై (తమిళ్), మాథ్/తండూల్జ (మరాఠీ), జంగ్లీ చొళై (పంజాబీ), తండల్జో (గుజరాతీ), కంట నోట్ (బెంగాలి)
 • అమరాంతస్ స్పైనోసస్

  అమరాంతస్ స్పైనోసస్

  విశదీకరణ: అమరాంతస్ స్పైనోసస్ అనేది స్పైనీ అమరంత్, స్పైనీ పిగ్‌వీడ్, ప్రిక్లీ అమరంత్ లేదా థోర్మీ అమరంత్‌గా మామూలుగా పిలవబడుతుంది. అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతం దీని పుట్టినిల్లు, కానీ అత్యధిక దేశాల్లోకి ప్రవేశించింది మరియు కొన్నిసార్లుఇది హానికారక కలుపుగా ఉంటోంది. స్థానిక పేరు - రాజగిరి సొప్పు (కన్నడ), ఎర్రముళ్ళుగోరంట (తెలుగు), ముల్ కీరై (తమిళ్), కాటేమత్ (మరాఠీ), జంగ్లీ చొళై (హిందీ), జంగ్లీ చొళై (పంజాబీ), తండల్జో (గుజరాతీ), బోన్నేటె సాక్ (బెంగాలి)
 • అర్జెమోనె మెక్సికన

  అర్జెమోనె మెక్సికన

  విశదీకరణ: అర్జెమోనె మెక్సినక అనేది అత్యంత కఠినమైన పయనీర్ మొక్క, ఇది కరవును మరియు మట్టిని తట్టుకుంటుంది, కొత్త రోడ్డు కటింగుల్లో లేదా అంచుల్లో మాత్రమే ఉంటుంది. దీనిలో ఉజ్వలమైన పసుపుపచ్చ లాటెక్స్ ఉంటుంది. ఇది పశువులకు విషపూరితమైనది. దీనిని స్థానికులే కాకుండా పాశ్చాత్య యుఎస్, మెక్సికోలోని కొన్ని ప్రాంతాల్లో మరియు భారతదేశంలోని కొన్నిప్రాంతాల్లో అనేకమంది ప్రజలు దీనిని ఔషధంగా ఉపయోగిస్తున్నారు. స్థానిక పేరు - దతుర గిడ (కన్నడ), బ్రహ్మదండి (తెలుగు), కురుక్కు (తమిళ్), పివల ధోత్ర (మరాఠీ), సత్యనాసి (పంజాబీ(), జఠా ఫోల్ (బెంగాలి), కాటేలి/సత్యనాసి (హిందీ), దరుడి/ సత్యనాసి (గుజరాతి)
 • బొయిరావియా ఎరెక్టా

  బొయిరావియా ఎరెక్టా

  బొయిరావియా ఎరెక్టా పుట్టుక యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, సెంట్రల్ అమెరికా మరియు పశ్చిమ దక్షిణ అమెరికా, కానీ ఇప్పుడు ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల ప్రాంతాలన్నిటికీ విస్తరించింది. ఆఫ్రికాలో ఇది పశ్చిమ ఆఫ్రికాకు , తూర్పున సోమాలియాకు మరియు దిగువన దక్షిణాఫ్రికాకు, ఆసియాలో ఇండియా, జావా, మలేసియా మరియు చైనా దేశాలకు విస్తరించింది. స్థానిక పేరు - ముక్కురత్తై (తమిళ్), పంఢరి పునర్నవ (మరాఠీ), శ్వేత (హిందీ), పహరీ పునర్నవ (బెంగాలి)
 • కాస్సియా టోరా

  కాస్సియా టోరా

  విశదీకరణ: కాస్సియా టోరా అనేది హెరాబసియస్ వార్షిక మూలిక. ఈ మొక్క 30-90 సెం.మీ ఎత్తున పెరుగుతుంది మరియు గుండ్రని మొనతో గోళాకారంలో ఉండే మూడు ఎదురెదురు జతల లీఫ్‌లేట్స్ గల ఆల్టర్నేటివ్ పిన్నేట్ ఆకులు ఉన్నాయి. ఆకులు పొడవుగా ఉంటాయి, లేతగా ఉన్నప్పుడు ప్రత్యేక సువాసన వచ్చే ఆకులు దీని కాండానికి ఉంటాయి. స్థానిక పేరు - నయి షెంగా (కన్నడ) పెద్ద కసింద (తెలుగు), తగ్రై (తమిళ్), టరోటా (మరాఠీ), జంగలీ దాల్ (హిందీ), దాల్ వాలీ భుటీ (పంజాబీ), కున్వాదియో (గుజరాతి), చకుంద (బెంగాలి)
 • కతరాంతస్ పుసిల్లస్

  కతరాంతస్ పుసిల్లస్

  విశదీకరణ: కతరాంతస్ పుసిల్లస్ అనేది సూక్ష్మ సగం ముడతలు గల, సగం నిటారుగా ఉండే వార్షిక మూలిక, ఇండియా దీని పుట్టినిల్లు. దీని మొదలు నుంచి అనేక కొమ్మలు విస్తరిస్తాయి. ఆకులు ఎదురెదురుగా ఉంటాఅయి, అంచులు గరుకుగా ఉండి బల్లెం ఆకారంలో ఉంటాయి. ఆకు మొదలు చిన్న కాండంలా సన్నగా ఉంటుంది. మొక్క అంతటా పాల సారం ఉంటుంది. ఎగువ ఆకుల కక్ష్యం చిన్న, తెల్లని, సగం ముడతలు పంపండి పూత సింగిల్‌గా లేదా జతలుగా కనిపిస్తుంది. స్థానిక పేరు - అగ్ని శిఖ (తెలుగు), సంగ్‌ఖపూలి/మిలగాయ్ పూడు (తమిళ్), సంకఫి (మరాఠీ), సాదాఫూలి (హిందీ), నయనతార (బెంగాలి)
 • సెలోసియా అర్జెంటియా

  సెలోసియా అర్జెంటియా

  విశదీకరణ: సెలోసియా అర్జెంటియా అనేది పలచని లెడా ఈటెలాంటి ఆకులు గల నిటారు గ్లాబ్రవస్ గడ్డి. పూత స్పైక్‌తో సాధారణంగా తెల్లగా లేదా గులాబిరంగులో ఉంటుంది. ఈ మొక్కలు ఉష్ణమండల మూలం కలవి కాబట్టి, బాగా ఎండ ఉన్నప్పుడు ఉత్తమంగా పెరుగుతాయి మరియు బాగా నీటి పారుదల ఉన్న చోట మొలకెత్తుతుంది. ఫ్లవర్‌‌హెడ్ 8 వారాల వరకు ఉంటుంది మరియు చనిపోయిన పూతను తొలగించడం ద్వారా మరింతగా వృద్ధిని పెంపొందించవచ్చు. Lస్థానిక పేరు - కుక్క (కన్నడ), కోడిగుట్టు ఆకు/గూనుగు (తెలుగు), సఫేద్ ముర్గ్ (హిందీ), పన్నై కీరై (తమిళ్), కురుదు/కొంబడా (మరాఠీ), లాంబడు (గుజరాతీ), మోరోగ్ ఝూటీ (బెంగాలి)
 • క్లెయోమ్ గైనాండ్ర

  క్లెయోమ్ గైనాండ్ర

  విశదీకరణ: క్లెయోమ్ గైనాండ్ర అనేది కూరగాయగా ఉపయోగించే క్లెయోమ్ జాతి. ఇది ఆఫ్రికాకు చెందిన వార్షిక వైల్డ్‌ఫ్లవర్, కానీ ప్రపంచంలోని అనేక ఉష్ణ మరియు ఉప-ఉష్ణ మండలాలకు వ్యాప్తి చెందింది. ఇది నిటారుగా, కొమ్మలతో ఉండే మొక్క. దీని యొక్క దూరందూరంగా ఉండే ఈ ఆకుల్లో ప్రతి ఒక్కదానికి 3-5 అండాకారపు చిన్న ఆకులు ఉంటాయి. పూలు తెల్లగా ఉంటాయి. స్థానిక పేరు - టిలోని (కన్నడ), వొమింట / తెల్ల వమిట / వెలకూర (తెలుగు), నైవేలై (తమిళ్), పంఢరి తిల్వన్ (మరాఠీ), హుర్ హుర్ (హిందీ), తిల్వని /తిల్‌మాణి (గుజరాతీ), స్వెట్ హుధుడే (బెంగాలి)
 • క్లెయోమ్ విస్కోస

  క్లెయోమ్ విస్కోస

  విశదీకరణ: క్లెయోమ్ విస్కోస అనెది మామూలుగా వర్షా కాలంలో కనిపిస్తుంది. నూరిన దీని ఆకులు నిల్వచేసిన శనగలకు పేడపురుగు సోకడాన్ని నివారించేందుకు చికిత్సగా ఉపయోగించవచ్చని పరిశోధనలో వెల్లడైంది. ఈ ఆకులను గాయాలు మరియు అల్సర్ల నివారణకు బాహ్య వినియోగంగా కూడా ఉపయోగిస్తారు. విత్తనాలు క్రిమిసంహారంగా మరియు వాయుహరిగా పనిచేస్తాయి. పూలు పసుపుపచ్చ రంగులో ఉంటాయి. స్థానిక పేరు - నయి బాల (కన్నడ), కుక్కవొమింట / కుక్క ఆవాలు (తెలుగు), నైకడుగు (తమిళ్), పివల తిల్వన్ (మరాఠీ), హుర్ హుర్ (హిందీ), తిల్వని / తిల్‌మణి (గుజరాతీ), బోన్ సోర్సే (బెంగాలి)
 • కొమ్మెలినా బెంఘాలెన్సిస్

  కొమ్మెలినా బెంఘాలెన్సిస్

  విశదీకరణ: కొమ్మెలినా బెంఘాలెన్సిస్ అనేది ఏడాది పొడవునా ఉండే మూలిక. ఉష్ణమండల ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలు దీని పుట్టినిల్లు. అనంతరం నియోట్రాపిక్స్, హవాలి, వెస్ట్ ఇండీస్ మరియు ఉత్తర అమెరికాలోని రెండు తీరాలకు విస్త్రుతంగా వ్యాప్తి చెందింది. దీని పూత ఎక్కువ కాలం ఉంటుంది. ఇది ఉప-ఉష్ణమండల ప్రాంతాల్లో వసంత కాలం నుంచి నుంచి భూమధ్యరేఖకు ఏడాది పొడవునా ఉంటుంది. ఇది తరచుగా బీడు భూముల్లో ఉంటుంది. స్థానిక పేరు - జిగాలి /హిత్తగని (కన్నద), వెన్నదేవికూర / యన్నాద్రి (తెలుగు), కనువ (పంజాబి), కనంగ్‌కోజై (తమిళ్), కెనా (మరాఠీ), బొకంద (గుజరాతీ), బొఖన/ కంకావు (హిందీ), ఎల్లో ఘాష్ (బెంగాలి)
 • కొమ్మెలినా కొన్నునిస్

  కొమ్మెలినా కొన్నునిస్

  విశదీకరణ: కొమ్మెలినా కొన్నునిస్ అనేది ఒకరోజు పూత కుటుంబానికి చెందిన హెర్బాసియస్ వార్షిక మూలిక. పూత ఒకరోజు మాత్రమే ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. దీని పుట్టుక తూర్పు ఆసియా మరియు ఆగ్నేయాసియాలోని ఉత్తర ప్రాంతాలు. చైనాలో ఈ మొక్కను యజికావో అంటారు. స్థానిక పేఋ - జిగాలి / హిత్తగని (కన్నడ), కెనా (మరాఠీ), కనువ (పంజాబి), బొఖన / కంకావు (హిందీ), బొకంది (గుజరాతీ), కన్సీరా (బెంగాలి))
 • కొమ్మెలినా డిప్యూస

  కొమ్మెలినా డిప్యూస

  విశదీకరణ: కొమ్మెలినా డిఫ్యూస అనేది వసంతంలోకి వస్తుంది మరియు బీడు భూముల్లో, తేమ ప్రాంతాల్లో మరియు అడవుల్లో చాలా మామూలుగా ఉంటుంది. చైనాలో ఈ మొక్కను ఫెబ్రిప్యూజ్ మరియు డైయురెటిక్‌గా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. పెయింట్‌లకు ఉపయోగించే బ్లూ డైని కూడా పూత నుంచి సంగ్రహిస్తారు. కనీసం ఒక పబ్లికేషన్ న్యూగైనాలో దీనిని వంటకు ఉపయోగించే మొక్కగా పేర్కొంది. స్థానిక పేరు - హిత్తగని (కన్నడ), కెనా (మరాఠీ), బొకంద (గుజరాతీ), బొఖన/ కంకావు (హిందీ), కనువ (పంజాబి), ధోల్‌సిరా /మనైన/ కనైనల (బెంగాలి)
 • కోర్కోరస్ ఒలిటోరియస్

  కోర్కోరస్ ఒలిటోరియస్

  విశదీకరణ: కోర్కోరస్ ఒలిటోరియస్ పుట్టినిల్లు ఆఫ్రికానా లేదా ఆసియానా అనే విషయం స్పష్టంగా తెలియలేదు. కొంతమంది అధికారులు ఇది ఇండో-బర్మా ఏరియా నుంచి లేదా ఇండియా నుంచి అనేక ఇతర సంబంధిత జాతులతో వచ్చిందని చెబుతారు. దీన్ ఇపుట్టుక ఎక్కడ ఉన్నప్పటికీ, ఇది ఉభయ ఖండాల్లో చాలా కాలంగా సాగులో ఉంది మరియు ఉష్ణమండల ఆఫ్రికాలోని ప్రతి దేశంలో బహుశా ఇది దానంతటదే లేదా పంటగా ఉంటోంది. స్థానిక పేరు - కాద్ చుంచలి (కన్నడ), పెరుం పున్నాకు (తమిళ్, తెలుగు), మోతీ చుంచ్ (మరాఠీ), జంగలి జ్యూట్ (హిందీ), చుంచ్/రాజ్‌గిరి (గుజరాతీ), భుంగిపట్ (బెంగాలి), జంగ్లీ సన్ (పంజాబీ)
 • కొర్కోరస్ ఏస్టువన్స్

  కొర్కోరస్ ఏస్టువన్స్

  విశదీకరణ: కోర్కోరస్ ఏస్టువన్స్ అనేది భారతదేశం అంతటా బీడు భూముల్లో మరియు సముద్ర మట్టానికి 2000 మీటర్ల ఎత్తులో ఉండే మామూలు వార్షిక మొక్క. ఇది అక్కడక్కడ కొమ్మలతో నిటారుగా ఉండే చిన్న మూలిక. అండాకార, ఎక్యూట్, ఆకుపచ్చని ఆకులకు అంచులు రంపంలా ఉంటాయి. పసుపుపచ్చని పూలు 1-3 గుత్తులుగా ఉంటాయి, తొడిమలు చాలా పొట్టిగా, ఆకులు చాలా చిన్నగా, ఎదురెదురుగా ఉంటాయి. స్థానిక పేరు - దండు బత్తి (కన్నడ), జనుజ్ము (తెలుగు), కట్టుత్తుటి (తమిళ్), చిక్తా (మరాఠీ, జంగలి జ్యూట్ (హిందీ), జంగలీ సన్ (పంజాబీ), చుంచ్ /రాజ్‌గిరి (గుజరాతీ), భుంగిపట్ /కాల్ చిరా (బెంగాలి)
 • కోర్కోరస్ యాక్యుటాంగులస్

  కోర్కోరస్ యాక్యుటాంగులస్

  విశదీకరణ: కోర్కోరస్ యాక్యుటాంగులస్ అనేది వార్షిక మూలిక, కాండాలకు ఒకవైను నూతు ఉంటుంది. ఆకులు అండాకారం నుంచి విస్త్రుత అండాకారంలో ఉంటాయి, అంచులు రంపంలా ఉంటాయి, కనీసం కొన్నిటికైనా ఒక జత బాసల్ సెటాయ్ ఉంటాయి, మొదలులో గుండ్రంగా, ఎక్యూట్‌గా, లేదా సబ్‌ఎక్యూట్‌గా ఉంటాయి, ఈననలపై మరియు మధ్య రిబ్‌లపై ప్రధానంగా అక్కడక్కడ పుష్పీకరణ ఉంటుంది. స్థానిక పేరు - చుంచలి సొప్పు (కన్నడ), పెరట్టి (తమిళ్, తెలుగు), కాడు చుంచ్ (మరాఠీ), జంగలీ జ్యూట్ (హిందీ), చుంచ్ /రాజ్‌గిరి (గుజరాతీ), నాల్టా పట్ (బెంగాలి), జంగ్లీ సన్ / జంగ్లీజ్యూట్ (పంజాబీ)
 • సైయానోటిస్ ఆక్సిల్లరిస్

  సైయానోటిస్ ఆక్సిల్లరిస్

  విశదీకరణ: సైయానోటిస్ ఆక్సిల్లరిస్ అనేది కొమ్మెలినాసేయి కుటుంబంలోని ఏడాది పొడవునా ఉండే మొక్క జాతి. భారత ఉపఖండం, దక్షిణ చైనా, ఆగ్నేయాసియా మరియు ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతాలు దీని పుట్టినిల్లు. ఇది వర్షకాల అటవీ, ఉడ్‌ల్యాండ్ మరియు కలప గ్రాస్‌ల్యాండ్‌లో పెరుగుతుంది. భారతదేశంలో దీనిని ఔషధీయ మొక్కగా ఉపయోగిస్తున్నారు మరియు పందులకు ఇది ఆహారంగా ఉపయోగించబడుతోంది. స్థానిక పేరు – ఇగాలి (కన్నడ), నీర్‌పుల్ (తమిళ్), వించ్‍‌కా (మరాఠీ), దీవాలియా (హిందీ), నారియల్ భాజీ (గుజరాతీ), ఝోరదాన్ / ఉరిదాన్ (బెంగాలి)
 • కాన్నబిస్ శాటివ

  కాన్నబిస్ శాటివ

  విశదీకరణ: కాన్నబిస్ శాటివ పుట్టినిల్లు తూర్పు ఆసియా. ఇది వార్షిక హెర్బేసియస్ పూత మొక్క. విస్త్రుతంగా పెరగడం వల్ల ఇది ఇప్పుడు కాస్మోపాలిటన్‌గా మారింది. పారిశ్రామిక ఫైబర్, విత్తన ఆయిల్, ఆహారం, వినోద, మత మరియు ఆధ్యాత్మిక మూడ్‌లకు మరియు మెడిసిన్‌కి మూలంగా ఉపయోగించేందుకు ఇది సాగు చేయబడుతోంది. మొక్కను ఉపయోగించడాన్ని బట్టి దీని లోని ప్రతి భాగాన్ని భిన్న సమయంలో కోస్తారు. స్థానిక పేరు - గాంజ / భంగ్ (హిందీ, పంజాబి, బెంగాలి), భంగి / గంజ (కన్నడ), భంగ్ (మరాఠీ, గుజరాతీ), అలటమ్ / అనంత ములి (తమిళ్), భంగి ఆకు / గంజాయి ఆకు (తెలుగు)
 • కరోనాపుస్ డైడిమస్

  కరోనాపుస్ డైడిమస్

  విశదీకరణ: కరోనాపుస్ డైడిమస్ అనేవి తక్కువగా వ్యాపించే వార్షిక హెర్బేసియస్ మొక్కలు. వీటి కాండాలు చాలా పొడవుగా, ఆకులు లోతు లోబ్స్‌తో మరియు తెల్ల పూత చిన్నగా ఉంటాయి. వీటికి ఘాటైన సువాసన ఉంటుంది, నులిమినప్పుడు గార్డెన్ క్రెస్ లాంటి సువాసన వస్తుంది. వీటి పుట్టినిల్లు మెడిటేరేనియన్, కానీ ఇతర ప్రాంతాలకు కూడా బాగా విస్తరించిన కలుపు ఇది. స్థానిక పేరు - భనియా బుటి (పంజాబి), జంగ్లీ హల/పీతాప్ర (హిందీ), గబ్బు కొథాంబరి (కన్నడ), గాజర్ పత్త / బకోస్ (బెంగాలి), విషముంగ్లి (తెలుగు)
 • కెనోపోడియం ఆల్బమ్

  కెనోపోడియం ఆల్బమ్

  విశదీకరణ: కెనోపోడియం ఆల్బమ్ అనేది శరవేగంగా పెరిగే వార్షిక కలుపు. దీనిని ఉత్తర భారతదేశంలో బతువా అనే ఆహార పంటగా విస్త్రుతంగా సాగుచేయబడుతోంది మరియు వినియోగించబడుతోంది. విస్త్రుతంగా సాగుచేస్తుండటం వల్ల దీని పుట్టినిల్లు ఏదో స్పష్టంగా తెలియదు. యూరప్‌లోని అత్యధిక ప్రాంతాల్లో ఉన్న దీనిని 1753లో లిన్నాయిస్ విశదీకరించారు. ఇది ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, ఓసియానియాల్లో విస్త్రుతమ్గా ఉన్న ఇది నత్రజని ఉన్న నేలల్లో మరియు ప్రత్యేకించి బీడు భూముల్లో దాదాపుగా (అంటార్క్‌టికాల్లో కూడా స్పష్టంగా ఉంది) పెరుగుతోంది. స్థానిక పేరు = భతువా /బతూ (హిందీ), బథావో (గుజరాతీ), చక్రవర్తి సొప్పు (కన్నడ), చక్‌వట్ (మరాఠీ), చక్రవర్తి కీరాయ్ (తమిళ్), వస్తుకమ్ / పప్పుకూర (తెలుగు), బెతో షాక్ / లాల్ భుక్త (బెంగాలి), బతు (పంజాబి)
 • దతురా మెటెల్

  దతురా మెటెల్

  విశదీకరణ: దతూరా మెటెల్ అనేది భారతదేశం లాంటి ప్రపంచంలోని వేడి ప్రాంతాలన్నిటిలో పెరుగుతున్న పొద లాంటి వార్షిక లేదా ఏడాది పొడవునా పెరిగే మూలిక మరియు రసాయనిక మరియు అలంకార గుణాలు ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా సాగు చేస్తున్నారు. స్థానిక పేరు - దతుర గిడ (కన్నడ), ధోత్రా (మరాఠీ), ధతుర (హిందీ), ఉమత్తన్ (తమిళ్), ఎర్రి ఉమ్మిత్త / తెల్ల ఉమ్మెత్త (తెలుగు), దతుర (గుజరాతి), ధుటోర (బెంగాలి), ధాతుర (పంజాబి)
 • డిజెరా అర్వెన్సిస్

  డిజెరా అర్వెన్సిస్

  విశదీకరణ: డిజెరా అర్వెన్సిస్ అనేది మొదలుకు సమీపంలో సరళంగా ఉండే లేదా పెరిగే కొమ్మలు, కాండం మరియు కొమ్మలు నునుపుగా లేదా చాలా దూరంగా నూగుతో, పాలిపోయిన అంచులతో ఉంటాయి. ఆకు బ్లేడ్ సన్నగా, ఒకె వరుస నుంచి అండాకారంలో లేదా అరుదుగా ఉప వర్తులాకారంలో ఉంటాయి. పూత నూగుతో మృదువుగా, గులాబి నుంచి కారరమైన్ లేదా ఎరుపురంగుతో తెల్లని లేచాయలో ఉంటాయి, పండు సాధారణంగా ఆకుపచ్చని – తెలుపు రంగులోకి మారుతుంది. స్థానిక పేరు - గోరాచి పాల్య (కన్నడ), చెంచలికూర (తెలుగు), తొయ్యకీరై (తమిళ్), కుంజరు (మరాఠీ), లహసువా/కుంజరు (హిందీ), కంజారో (గుజరాతి), లత మహవ్రియా / లత మహురి (బెంగాలి), లతాసువా (పంజాబి)
 • యుఫోర్బియా జెనికులాట

  యుఫోర్బియా జెనికులాట

  విశదీకరణ: యుఫోర్బియా జెనికులాట పుట్టినిల్లు అమెరికాలోని ఉష్ణమండల మరియు ఉప-ఉష్ణమండల ప్రాంతం, ఇప్పుడుజ్ ఇది అన్ని ఉష్ణ మండలాలకు విస్తరించింది. అనేక కలుపునాశినిలు దీనిని నియంత్రించడంలో విఫలమయ్యాయి కాబట్టి ఇది ప్రపంచంలోని అనేక భాగాలకు వేగంగా విస్తరించింది. ఈ మొక్క దక్షిణ మరియు ఆగ్నేయాసియా ప్రాంతాలకు అలంకార మొక్కగా ప్రవేశ పెట్టబడింది. ఇది భారతదేశంలో మరియు థాయ్‌లాండ్‌లో కలుపు మొక్క అయ్యింది. ఇది ప్రత్తి మరియు ఇతర వ్యవసాయ పంటలపై దాడి చేస్తోంది. స్థానిక పేరు - హాల్ గౌరి సొప్పు (కన్నడ), నానుబాలు (తెలుగు), బరో కోర్ని (బెంగాలి), కాతురక్ కల్లి (తమిళ్), మోతి దుధి (మరాఠీ), దుధేలి (పంజాబి), బడీ దుధేలి (హిందీ), మోతి దుధేలి (గుజరాతి)
 • యుఫోర్బియా హైపరిసిఫోలియా

  యుఫోర్బియా హైపరిసిఫోలియా

  విశదీకరణ: యుఫోర్బియా హైపరిసిఫోలియా పుట్టినిల్లు అమెరికాలోని ఉష్ణమండల మరియు ఉప-ఉష్ణమండల ప్రాంతం మరియు ఉష్ణ మండల ఆఫ్రికా మరియు ఇండియాకు విస్తరించింది. ఇది ఉష్ణమండల ఆఫ్రికాకు విస్తరించిందా అనే విషయం స్పష్టంగా తెలియలేదు, ఎందుకంటే ఇది యుఫోర్బియా ఇండికా ల్ యామ్ మాదిరిగా అనిపిస్తోంది. ఇది పశ్చిమ ఆఫ్రికా, బూరుండి మరియు మారిషస్‌లో కచ్చితంగా పెరుగుతుంది. స్థానిక పేరు - హాల్ గౌడి సొప్పు (కన్నడ), దుధి (మరాఠీ), దుధేలి (గుజరాతీ), చిన్నమన్ పచారసి (తమిళ్), చోటీ దుధేలి (హిందీ), దుధేలి (పంజాబి), మనసాసి (బెంగాలి)
 • జ్ఞఫాలియం పుర్పురేయం

  జ్ఞఫాలియం పుర్పురేయం

  విశదీకరణ: జ్ఞఫాలియం పుర్పురేయం అనేది ఉష్ణమండల ప్రాంతాల్లో విస్త్రుతంగా మరియు మామూలుగా వ్యాపిస్తుంది. అయితే కొన్ని ప్రపంచంలోని ఉష్ణమండల పర్వతాల్లో లేదా ఉప-ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తాయి. అమెరికన్ పెయింటెడ్ లేడీ క్యాటార్‌పిల్లర్స్‌కి కడ్‌వీడ్స్ ముఖ్యమైన ఆహార మొక్కలు. దీని నుంచి వేరుచేసిన ఈ జీనస్ మరియు కాంపౌండ్స్ సారాలు అనేక ఫార్మాకోలాజికల్ కార్యకలాపాలను ప్రదర్శించాయి. స్థానిక పేరు - అందుబాటులో లేదు
 • ఐపోమోయియా ఆక్వాటికా

  ఐపోమోయియా ఆక్వాటికా

  విశదీకరణ: ఐపోమోయియా ఆక్వాటికా అనేది సెమీ-ఆక్వాటిక్ ఉష్ణమండల మొక్క. దీని కాండాలు మెత్తగా ఉంటాయి కాబట్టి కూరగాయగా దీనిని పండిస్తారు. దీని పుట్టినిల్లు ఏదీ తెలియదు. దీనిని ప్రధనంగా తూర్పు, దక్షిణ మరియు ఆగ్నేయాసియాల్లో పెంచుతారు. ఇది నీటి మార్గాల్లో సహజంగా పరిఢవిల్లుతుంది మరియు పెద్దగా సంరక్షణ అవసరం లేదు. దీనిని ఇండోనేషియా, బర్మా, థామ్, లావో, కాంబోడియా, మలయ్, వియత్నాం, ఫిలిపిన్ మరియు చైనీస్ వంటకాల్లో, ప్రత్యేకించి గ్రామీణ లేదా కంపుంగ్ (గ్రామ) ప్రాంతాల్లో విరివిగా ఉపయోగిస్తారు. స్థానిక పేరు - తంటికాడ / తూటి కూర (తెలుగు), బేల్ (పంజాబి), కలామి (హిందీ), నాలిచి భాజీ / ఖంద్ కోలి (మరాఠీ), నారో / కలదాన (గుజరాతి), కోల్మి సాక్ (బెంగాలి)


 • ఐపోమోయియా నిల్

  ఐపోమోయియా నిల్

  విశదీకరణ: ఐపోమోయియా నిల్‌ని1000 సంవత్సరాలకుక్ పైగా క్రితం ఔషధీయ మూలికగా చైనా నుంచి జపాన్‌లో ప్రవేశపెట్టబడింది. అప్పటి నుంచి పెద్ద సంఖ్యలో గార్డెన్ రకాలను పెంచి అలంకార పనులకు నిర్వహించడం జరిగింది. అనే ప్రాంతాల్లో దేనిని అలంకార మొక్కగా సాగుచేస్తున్నారు. గార్డెన్ ఎస్కేపీస్ అసమ్మతిదారులు ఇప్పుడు దీనిని విస్తారంగా పెంచుతున్నారు. ఇది మూడు-మొనదేలిన ఆకులు గల వార్షిక పాకుడు మొక్క, పూలు అనేక సెంటీమీటర్ల వెడల్పు ఉంటాయి మరియు నీలం, పింకు లేదా రోజా షేడ్‌లల్లో, తరచుగా తెల్లని చారలతో కనిపిస్తాయి. స్థానిక పేరు - సంగుపూ (తమిళ్), నీల్‌కలామి (హిందీ), కాలా దానా బెల్ (పంజాబీ), కొల్లివిత్తులు (తెలుగు), నారో/కాలాదానా (గుజరాతీ), నీల్‌కాల్లో సాక్ (బెంగాలి)
 • ఐపోమోయియా పేస్ టైగ్రైడిస్

  ఐపోమోయియా పేస్ టైగ్రైడిస్

  విశదీకరణ: ఐపోమోయియా పేస్ టైగ్రైడిస్అనేది నూగుగా, తీగతో ఉండే వార్షిక మొక్క. ఇది వ్యాపించే లేదా అల్లుకు పోయే మూలిక.ఇది హెర్బాసియస్ వార్షిక మొక్క, ఇది భారతదేశ వ్యాప్తంగా కొండలపై 4000 అడుగుల వరకు, సముద్ర తీర ప్రాంతంలో 750-900 మీటర్ల వరకు అల్లుకు పోతుంది. హృదయం ఆకారంలో ఉండే దీని ఆకులు పొడవుగా, ఆకు అంచులో 9-10 లోబ్‌లతో ఉంటాయి. డోలు ఆకారంలో ఉండే పూతకు అయిదు మొనలు ఉంటాయి. ఇది ఎరుపు, పింకు లేదా తెలుపు రంగులో ఉంటుంది మరియు సాయంత్రం 4 గంటల తరువాత విచ్చుకుంటుంది మరియు దీని పూత వ్యవధి సెప్టెంబరు మరియు నవంబరు మధ్య ఉంటుంది. స్థానిక పేరు - చికునువ్వు/మేకమడుగు (తెలుగు), వాఘ్‌పాడి (మరాఠీ), బెల్ (హిందీ, పంజాబీ), నారో/కాలాదానా (గుజరాతీ), అంగులి లోటా (బెంగాలి)
 • ఐపోమోయియా ట్రైలోబ

  ఐపోమోయియా ట్రైలోబ

  విశదీకరణ: ఐపోమోయియా ట్రైలోబపుట్టినిల్లు ఉష్ణమండల అమెరికా. కానీ ప్రపంచంలోని ఇతర వెచ్చని ప్రాంతాలకు విస్త్రుతుంగా వ్యాపించింది. దీనిని స్పెసీస్‌గా ప్రవేశపెట్టారు మరియు తరచుగా హానికారక కలుపు. ఇది వేగంగా పెరుగుతుంది, అల్లుకుపోయే వార్షిక మూలిక. దీని ఆకులు పొడవుగా, కాండాలు పలచగా ఏనుగు దంతాల మాదిరిగా, తొడిమ, గుండె ఆకారంలో ఉంటాయి. స్థానిక పేరు ఇవాలి భోవ్రీ (మరాఠీ), బెల్ (హిందీ, పంజాబీ), నారో/కాలాదానా (గుజరాతీ), ఘోంటి కోల్మి (బెంగాలి)
 • ల్యూకస్ ఆస్పెరా

  ల్యూకస్ ఆస్పెరా

  విశదీకరణ: ల్యూకస్ ఆస్పెరా జాతి ల్యూకస్ మరియు కుటుంబం లామియాసేయి. ఇది ఉన్న ప్రాంతంపై ఆధారపడి దీనికి భిన్న మామూలు పేర్లు ఉన్నప్పటికీ, దీనిని థుంబే లేదా థుంబై అంటారు. భారతదేశ వ్యాప్తంగా ఉందే దీనిని ఔషధ మరియు వ్యవసాయ రంగాల్లో వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. స్థానిక పేరు - తుంబి సొప్పు (కన్నడ), తుమ్మి (తెలుగు), తుంబై (తమిళ్), తాంబ (మరాఠీ), కూబి (గుజరాతీ, స్వాత డ్రోన్/ధూల్ఫీ/దాన్ కాలాస్ (బెంగాలి)
 • ల్యూకస్ మార్టినిసెన్సిస్

  ల్యూకస్ మార్టినిసెన్సిస్

  విశదీకరణ: ల్యూకస్ మార్టినిసెన్సిస్ నిటారుగా ఉండే వార్షిక హెర్బ్. సాధారణంగా కొమ్మలు కాండాలకు నూగు ఉంటుంది. ఆకులు ఎదురెదురుగా, అండాకారం నుంచి ఒవేట్-లాన్స్ ఆకారంలో ఉంటాయి, అంచులకు ముతక పళ్ళు ఉంటాయి. కాండం పొడవునా నిరంతరాయంగా గుండ్రని గుత్తులుగా చిన్న తెల్లని పూలు పూస్తాయి. పొడవాటి ముళ్ళ లాంతి-రక్షక పత్రాలు పూత గుత్తులను నూగుగా కనిపించేలా చేస్తాయి. స్థానిక పేరు - తుంబి సొప్పు (కన్నడ), పెరుమ్ తుంబై (తమిళ్), కూబి (గుజరాతీ), స్వెట్ డ్రోన్ (బెంగాలి)
 • మిత్రకార్పస్ విల్లోసస్

  మిత్రకార్పస్ విల్లోసస్

  విశదీకరణ: మిత్రకార్పస్ విల్లోసస్ నిటారుగా ఉండే లేదా వ్యాపించే వార్షిక హెర్బ్, కొమ్మలు లేకుండా ఎత్తుగా లేదా అక్కడక్కడ నుంచి చాలా కొమ్మలు గల కాండాలు, కొద్దిగా వంపు తిరిగి మరియు అణచివేయబడిన నూగుతో కొమ్మలు కౌమారగా ఉంటాయి మరియు తరచుగా వ్యాపిస్తుంటాయి, ముదురు ఆకులు అంతిమంగా పాలిపోతాయి. కొన్నిసార్లు మొదలులో చాలా ఉడీగా ఉంటుంది. స్థానిక పేరు - అందుబాటులో లేదు
 • ఆక్సాలిస్ కార్నిక్యులాటా

  ఆక్సాలిస్ కార్నిక్యులాటా

  విశదీకరణ: ఆక్సాలిస్ కార్నిక్యులాటా అనేది క్రీపింగ్ ఉడ్‌సారెల్. ఇది కొంతమేర సున్నితంగా కనిపించే, తక్కువగా పెరిగే, హెర్బాసియస్ మొక్క. ఈ జాతి పుట్టినిల్లు బహుశా దక్షిణాసియా. ఇటలీకి చెందిన స్పెసిమెన్స్‌ని ఉపయోగించి 1753లో లిన్నాయస్ దీనిని మొదటగా వివరించారు మరియు 1500కి పూర్వ తూర్పు నుంచి ఇటలీకి ప్రవేశపెట్టబడినట్లుగా అనిపిస్తోంది. ఇప్పుడు దీని పంపిణీ ఇప్పుడు కాస్మోపాలిటన్‌గా ఉంది మరియు గార్డెన్స్, వ్యవసాయ పొలాల్లో మరియు లాన్స్‌లో కలుపుగా పరిగణించబడుతోంది. స్థానిక పేరు - అమృల్/ఖట్టి మిట్టి గడ్డి/చుకా (హిందీ), ఖట్టి బుటి (పంజాబీ), ఉప్పిన సొప్పు (కన్నడ), పలియాకిరి (తమిళ్), అమృల్‌షక్ (బెంగాలి), అంబుట్ (మరాఠీ), పులిచింత/ఆంబోతి కూర (తెలుగు)
 • పార్థీనియమ్ హిస్టెరోఫోరస్

  పార్థీనియమ్ హిస్టెరోఫోరస్

  విశదీకరణ: పార్థీనియమ్ హిస్టెరోఫోరస్ అనేది రోడ్డు పక్కలతో పాటు విఘాతం కలిగిన భూమిని ఆక్రమిస్తుంది. ఫెమిన్ కలుపు లాంటి మామూలు పేర్లలో ప్రతిబింబించినట్లుగా, ఇది పచ్చికబయళ్ళను మరియు వ్యవసాయ భూమికి సోకి, తరచుగా విపరీతంగా దిగుబడి నష్టం కలిగిస్తుంది. ఆక్రమణదారుగా ఇది మొదటగా దిగుమతి గోధుమలో కలుషితంగా కనిపిస్తుంది. పంటను మరియు పశుగ్రాస మొక్కలను మరియు మనుషులను మరియు పశువులను ప్రభావితం చేసే ఎలర్జెన్స్‌ని అణిచివేసే అల్లోపతిక్ రసాయనాలను మొక్క ఉత్పత్తి చేస్తుంది. స్థానిక పేరు - కాన్‌గ్రెస్ (కన్నడ), వయ్యారి భామ (తెలుగు), విషపూందు (తమిళ్), గాజర్ గావత్ (మరాఠీ), గాజర్ ఘాస్ (బెంగాలి), కాన్‌గ్రెస్ఘాస్ (పంజాబీ), కాన్‌గ్రెస్ ఘాస్ (గుజరాతి)
 • ఫైలాంథస్ నిరురి

  ఫైలాంథస్ నిరురి

  విశదీకరణ: ఫైలాంథస్ నిరురి అనేది అనేది సముద్ర తీర ప్రాంతల్లో మామూలుగా ఉండే విస్త్రుతంగా వ్యాపించే ఉష్ణమండల మొక్క, మామూలు పెనుగాలులు, స్టోన్‌బ్రేకర్ లేదా ఆకు చాటు విత్తనం లాంటి మామూలు పేర్లతో తెలుస్తోంది. ఇది ఫైలాంతస్ జాతికి మరియు ఫైలాంథసేయి కుటుంబానికి చెందిన, స్పర్జెస్‌కిసంబంధించినది ఇది. స్థానిక పేరు - నెల్లి గిడ (కన్నడ), నేల ఉసిరి (తెలుగు), కీలనెల్లి (తమిళ్), భూయియావలి (మరాఠీ), హజర్‌దాన (హిందీ, పంజాబీ), భోయ్ అమలి (గుజరాతి), వుయి ఆమ్ల (బెంగాలి)
 • ఫిసలిస్ మినిమా

  ఫిసలిస్ మినిమా

  విశదీకరణ: ఫిసలిస్ మినిమా అనేది ఉష్ణమండల వార్షిక మూలిక. ఆకులు మెత్తగా మరియు మృదువుగా (నూగు ఉండదు), అంచులు ఎగుడుదిగుడుగా ఉంటాయి. పూత క్రీమ్ నుంచి పసుపుపచ్చ రంగులో ఉంటుంది, ఆ తరువాత తినే పండు పసుపుపచ్చని రంగులో పేపరు కవర్‌లో ఉంటుంది, ఇది గడ్డిని గోధుమరంగులోకి మార్చి పండు పూర్తిగా పండినప్పుడు నేలపైకి రాలిపోతుంది. మొక్కకు కలుపు గుణం ఉంటుంది, తరచుగా బీడు భూముల్లో పెరుగుతుంది. స్థానిక పేరు - సన్న గుప్పతె గిడ (కన్నడ), బుద్ధ బూసద (తెలుగు), కుపంటి (తమిళ్), రాన్ పోప్టి (మరాఠీ), చిర్‌పోట (హిందీ), పోఫ్టీ (గుజరాతి), భాంబోడెన్ (పంజాబీ), తస్క/ధూలి మౌర (బెంగాలి)
 • ఫైలాంతస్ మదెరాస్పాటెన్సిస్

  ఫైలాంతస్ మదెరాస్పాటెన్సిస్

  విశదీకరణ: ఫైలాంతస్ మదెరాస్పాటెన్సిస్ అనేది నిటారు నుంచి అల్లుకుపోవడం, కొమ్మలు లేకపోవడం నుంచి కొమ్మలు చాలా ఎక్కువగా ఉండడం, వార్షికం నుంచి ఏడాది పొడవునా ఉండే ఈ మొక్కకు కొమ్మలు ఎక్కువ లేదా తక్కువ ఉడీగా ఉంటాయి మరియు సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంటుంది. మందుల్లో స్థానికంగా ఉపయోగించుకునేందుకు అడవుల నుంచి మొక్కలను కోస్తారు. వీటిని స్థానిక మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తారు మరియు ఫార్మాస్యూటికల్ ఉత్పాదనల వాణిజ్య ఉత్పాదనకు కూడా విక్రయించబడుతున్నాయి. స్థానిక పేరు - ఆడు నెల్లి హుల్లు (కన్నడ), నేల ఉసిరి (తెలుగు), మేలనెల్లి (తమిళ్), భూయిఅవలి (మరాఠీ), భోయ్ అమలి (గుజరాతి), హజర్ మొని (బెంగాలి), బడా హజర్‌డానా/హజర్‌‌మణి (హిందీ), దానే వాలీ బుట్టీ (పంజాబీ)
 • పోర్టులాకా ఒలెరాసియా

  పోర్టులాకా ఒలెరాసియా

  విశదీకరణ: పోర్టులాకా ఒలెరాసియా అనేది గంగపాయలాకు, ఇది మృదువుగా, ఎర్రగా, చాలా వరకు ఎదురెదురుగా ఉండే కాండాలు మరియు ఆకులు కలిగివుంటుంది, ఇవి ఒకటి చిడిచి మరొకటి లేదా ఎదురెదురుగా ఉంటాయి, కాండమ్ జాయింట్లలో మరియు చివరల్లో గుత్తులుగా ఉంటాయి. ఆకు క్లస్టర్ మధ్యలో పూలు సూర్యోదయంలో కొద్ది గంటల సేపు మాత్రమే విచ్చుకుంటాయి. దీనిని మొట్టమొదట 1672లో యునైటెడ్ స్టేట్స్‌లోని మాసాచుసెట్స్‌లో గుర్తించబడింది. స్థానిక పేరు - సన్న గోలి సొప్పు (కన్నడ), పప్పుకూర/పిచ్చి మిరప (తెలుగు), పరుప్పు కీరై (తమిళ్), ఘోల్ (మరాఠీ), చోటీ సంత్ (హిందీ), సంతి (పంజాబీ), లూని (గుజరాతి), నూనియా సాక్ (బెంగాలి)
 • సోలానమ్ నిగ్రుమ్

  సోలానమ్ నిగ్రుమ్

  విశదీకరణ: సోలానమ్ నిగ్రుమ్ అనేది సింపుల్‌గా నైట్‌‌షేడ్ లేదా బ్లాక్‌బెర్రీ నైట్‌‌షేడ్‌గా ఉంటుంది. సోలానమ్ జాతికి చెందిన దీని పుట్టినిల్లు యూరాసియా మరియు అమెరికా, ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికాల్లో ప్రవేశపెట్టబడింది. పండిన పండ్లు మరియు వండిన ఆకులను కొంతమంది స్థానికులు ఆహారంగా ఉపయోగిస్తున్నారు మరియు మొక్క భాగాలను సాంప్రదాయకంగా మందుగా ఉపయోగిస్తున్నారు . ఇది అనేక అటవీ ప్రాంతాల్లో మరియు బంజరు భూముల్లో కనిపిస్తుంది. స్థానిక పేరు - మకోయి/పీలక్/పపోటన్ (హిందీ), మకోయి (పంజాబీ), పిచ్చి మిరప/ కంచి పొండ/కసక (తెలుగు), కంగని/లఘుకావలి (మరాఠీ), మనతక్కాలి (తమిళ్), కరికాచి గిడ (కన్నడ), మకో /పిలుడి (గుజరతి), బోన్ బెగన్ /కక్‌మాచి (బెంగాలి)
 • ట్రయాంథెమా మోనోగైనా

  ట్రయాంథెమా మోనోగైనా

  విశదీకరణ: ఈ జాతి వార్షికంగా లేదా ఏడాది పొడవునా ఉంటుంది, సాధారణంగా ఆకులు కండగా, ఎదురెదురుగా, అసమానంగా, మృదువైన అంచులలో ఉంటాయి. ఎదురెదురుగా పెరగడం వల్ల పూలు అయిదు పరిపత్ర విభాగాలు జత పత్రకాల వల్ల మధ్య కోణం ఏర్పడుతుంది మరియు పండుకు రెక్కలు గల మూత ఉంటుంది. వీటిని మామూలుగా హార్స్ పర్‌స్లనేస్ అంటారు. స్థానిక పేరు - దొడ్డగోల్ పాళ్య (కన్నడ), షవలాయ్ /సరనాయ్ (తమిళ్), ఖాప్రా/విష్‌ఖాప్రా (మరాఠీ), సటాడో (గుజరాతి), గడబాణి (బెంగాలి), బిస్కపాద/పత్తర్‌ఛాట (హిందీ, పంజాబీ)
 • టయాంథెమా పోర్టులాకాస్ట్రమ్

  టయాంథెమా పోర్టులాకాస్ట్రమ్

  విశదీకరణ: టయాంథెమా పోర్టులాకాస్ట్రమ్ అనేది ఎడారి గుర్రపు పర్‌స్లేన్, నలుపు పిగ్‌వీడ్ మరియు జెయింట్ పిగ్‌వీడ్‌గా పిలవబడే ఐస్ మొక్క కుటుంబానికి చెందిన పూల మొక్కజాతి. ఆఫ్రికా మరియు ఉత్తర మరియు దక్షణి అమెరికాతో సహా అనేక ఖండాలు దీనికి పుట్టినిల్లు మరియు అనేక ఇతర ప్రాంతాల్లో ప్రవేశపెట్టబడిన జాతిగా ఉంది. స్థానిక పేరు - దొడ్డగోలి సొప్పు (కన్నడ), సరనాయ్ (తమిళ్), సటోడో (గుజరాతీ), నీరుబైలకు / అంబటిమాడు (తెలుగు), పంఢరి ఘేతులి (మరాఠీ), పునర్నవ సాక్ / శ్వేత్ పునర్నవ (బెంగాలి), బిస్కపాద /పథర్ ఛాట (హిందీ, పంజాబీ)
 • ట్రైడాక్స్ ప్రొకుంబెన్స్

  ట్రైడాక్స్ ప్రొకుంబెన్స్

  విశదీకరణ: ట్రైడాక్స్ ప్రొకుంబెన్స్ అనేది డైసీ కుటుంబంలో పూల మొక్కజాతి. దీనిని విస్త్రుతంగా వ్యాపించిన కలుపు మరియు కీటక మొక్క అని కూడా పిలుస్తారు. ఉష్ణమండల అమెరికా దీని పుట్టినిల్లు, కానీ దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల, ఉప-ఉష్ణమండల మరియు స్వల్ప ఉష్ణోగ్రతలు గల ప్రాంతాల్లో దీనిని ప్రవేశపెట్టారు. ఇది యునైటెడ్ స్టేట్స్‌లో హానికారక కలుపుగా గుర్తించబడింది మరియు తొమ్మిది రాష్ట్రాల్లో కీటకం స్టేటస్ కలిగివుంది. స్థానిక పేరు - విషల్య కరణి / ట్రైధార (బెంగాలీ), కాన్‌ఫులి /బహర్‌మసి (హిందీ), వెట్టుకాయ పూండు (తమిళ్) ఏక్ దండి (మరాఠీ, గుజరాతీ), వట్‌వటి (కన్నడ)
 • జాంథియమ్ స్ట్రుమారియమ్

  జాంథియమ్ స్ట్రుమారియమ్

  విశదీకరణ: జాంథియమ్ స్ట్రుమారియమ్ అనేది కలుపుగా మామూలుగా ఉండే ఔషధ మొక్క. ఇది ఉత్తర అమెరికా, బ్రెజిల్, చైనా, మలేసియా మరియు భారతదేశంలోని వేడి ప్రాంతాల్లో విస్త్రుతంగా విస్తరించివుంది. మూలికను సాంప్రదాయకంగా అనేక అనారోగ్యాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. పూర్తి మొక్క సారాలను ప్రత్యేకించి ఆకులు, వేర్లు, పండ్లు మరియు విత్తనాలను సాంప్రదాయ మందుల్లో ఉపయోగించబడుతోంది. స్థానిక పేరు - మరులు మట్టి (కన్నడ), మరులమాతంగి / గడ్డిచామంతి (తెలుగు), గదర్ (గుజరాతి), మరుల్ ఉమత్తయ్ / ఒత్తరచెడి (తమిళ్), గోఖరు (మరాఠీ), ఛోటా గోతురు/ ఛోటా ధాతురా (హిందీ), ఖుట్టా (పంజాబీ), సియాల్ కాట (బెంగాలి)
 • సైపరస్ రొటాండస్

  సైపరస్ రొటాండస్

  విశదీకరణ: సైపరస్ రొటాండస్ అనేది ఏడాది పొడవునా ఉండే మొక్క, ఇది 140 సెం.మీ ఎత్తు వరకు పెరుగుతుంది. “నట్ గ్రాస్” మరియు “నట్ స్కోప్” అనే పేర్లు సైపరస్ ఎస్కులెంటస్ సంబంధ జాతులతో పంచుకోబడతాయి మరియు తన దుంపల నుంచి సంగ్రహించబడతాయి, దుంపలు కొంతవరకు జీవశాస్త్రపరంగా నట్‌లను పోలివున్నప్పటికీ, వీటికి నట్స్‌తో సంబంధం లేదు. స్థానిక పేరు - జెకు (కన్నడ), భద్రతుంగ ముస్తే / భద్రముస్తే/గండల (తెలుగు), కొరై కిఝాంగు (తమిళ్), మోథా /దిల్లా (హిందీ), నగర్‌మొత్త /లవ్‌హల (మరాఠీ), గంత్ వాలా ముర్క్ (పంజాబీ), చిఢో (గుజరాతీ), వాడ్లా ఘాస్ /చాటా బెతి ముథా (బెంగాలి)
 • సైపరస్ కంప్రెసస్

  సైపరస్ కంప్రెసస్

  విశదీకరణ: సైపరస్ కంప్రెసస్ అనేది ఏడాది వార్షిక తుంగగా పిలబడుతోంది. ఇది వెచ్చని వాతావరణాలు గల దేశాలన్నిటిలోనూ విస్త్రుతంగా కనిపించే సైపరాసేయి కుటుంబానికి చెందిన తుంగ. ఇది ఆఫ్రికా, ఆసియా మరియు అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తుంది. స్థానిక పేరు - జెకు (కన్నడ), కొత్త కొరై (తమిళ్), చిందో (గుజరాతి), నగర్ మోథా / లవ్‌హల (మరాఠీ), నగర్ మోథా (హిందీ), జోల్ ముథా (బెంగాలి)
 • ఫింబ్రిస్టిలిస్ మిలియాసియా

  ఫింబ్రిస్టిలిస్ మిలియాసియా

  విశదీకరణ: ఫింబ్రిస్టిలిస్ మిలియాసియా అనేది తుంగ జాతి. ఈ జాతిలోని మొక్కను మామూలుగా ఫింబ్రీ, ఫింబ్రిస్టెల్ లేదా ఫ్రింజ్- రష్ గా పిలుస్తారు. ఇది ఆసియాలోని ఉష్ణమండల తీరప్రాంతం దీని పుట్టినిల్లు, కానీ అత్యధిక ఖండాలకు విస్తరించింది. ఇది కొన్ని ప్రాంతాల్లో విస్త్రుతంగా వ్యాపించిన కలుపు మరియు కొన్నిసార్లు వరి పొలాల్లో సమస్యాత్మకంగా ఉంటుంది. స్థానిక పేరు - మని కొరై (తమిళ్), లవ్‌హల (మరాఠీ), హుయ్ / దిలీ (హిందీ), గురియా ఘాస్ (బెంగాలి)

COMING SOON